News November 2, 2025
అవి నిరాధార ఆరోపణలు: ప్రశాంత్ వర్మ

తనపై ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసినట్లు వస్తున్న వార్తలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఖండించారు. అవన్నీ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని స్పష్టం చేశారు. ‘నాకు, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు మధ్య ఉన్న వివాదం తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వద్ద పరిశీలనలో ఉంది. దీనిపై వారు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా వివాదాలు సృష్టించవద్దు’ అని ఓ ప్రకటనలో కోరారు.
Similar News
News November 3, 2025
Take A Bow: మనసులు గెలిచిన కెప్టెన్ లారా

భారత్ ఉమెన్స్ WCను లిఫ్ట్ చేసినప్పుడు గెలుపు గర్జనతో స్టేడియం మారుమోగింది. అంతా విజయోత్సాహంలో నిండిపోయారు. కానీ, SA కెప్టెన్ లారా ముఖంలో విషాదం నిండిపోయింది. ఫైనల్లో సెంచరీ సహా 9 మ్యాచుల్లో 571 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా SAకి తొలి WC అందించాలన్న తన కల సాకారం కాలేదు. అయితే ఆమె పోరాటం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
News November 3, 2025
షెఫాలీ షో.. చరిత్ర సృష్టించింది

షెఫాలీ వర్మ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించారు. ఫైనల్లో 87 రన్స్ చేయడమే కాకుండా.. 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్ షెఫాలీ(21 ఇయర్స్) కావడం విశేషం. గాయపడిన ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన ఆమె అనూహ్యంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘ఏదో మంచి చేయాలనే భగవంతుడు నన్ను జట్టులోకి పంపాడు’ అంటూ షెఫాలీ ఆనందం వ్యక్తం చేశారు.
News November 3, 2025
టీమ్ ఇండియాకు ప్రధాని శుభాకాంక్షలు

విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు PM మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫైనల్‌లో వారి ప్రదర్శన స్కిల్, ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఈ విజయం భవిష్యత్ ఛాంపియన్‌లకు స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. ‘మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారు. ఛాంపియన్లకు అభినందనలు’ అని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఈ విన్ చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీ చరణి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది’ అని లోకేశ్ పేర్కొన్నారు.


