News December 7, 2025

ఆదిలాబాద్: పార్టీ రెబల్స్‌తో ‘పంచాయితీ’

image

పంచాయతీ ఎన్నికల వేళ సొంత పార్టీలోని రెబెల్స్‌తో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ పెద్దలు హెచ్చరించినా.. ఇంకేదైనా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన పలువురు రెబెల్స్ వెనక్కి తగ్గకుండా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. చిన్న పల్లెల్లో ఒక పార్టీ నుంచి ఇద్దరూ, మేజర్ పంచాయతీల్లో నలుగురు బరిలో నిలిచారు. దీంతో ఓట్లు చెయ్యి పార్టీ అభ్యర్థులు గెలవరేమోనని నాయకుల్లో ఆందోళన నెలకొంది.

Similar News

News December 9, 2025

మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

image

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్‌లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

News December 9, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్‌డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, లగేజీ వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.

News December 9, 2025

రామన్నపేట ఆర్‌ఐ రాజేశ్వర్‌ సస్పెండ్‌

image

రామన్నపేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) రాజేశ్వర్‌ను సస్పెండ్‌ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. కక్కిరేణిలోని శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎకరాల భూమి ధరణిలో తప్పుగా నమోదైంది. దీనిపై 2024లో ఆర్‌ఐ పంచనామా చేసి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే, 2025 జనవరిలో క్షేత్రస్థాయికి వెళ్లకుండా తప్పుడు పంచనామా ఇచ్చినందుకు ఆయనను సస్పెండ్‌ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.