News November 12, 2025

ఆదిలాబాద్ రిమ్స్ సీఎంఓ గుండెపోటుతో కన్నుమూత

image

ఆదిలాబాద్ రిమ్స్‌లోని క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) నగేష్ గౌడ్ (30) గుండెపోటుతో మృతి చెందారు. టీచర్స్ కాలనీలో నివాసముంటున్న నగేష్ గౌడ్‌కు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోర్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.

Similar News

News November 12, 2025

ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

image

భారత్‌లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్‌వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

News November 12, 2025

శ్రీకాళహస్తిలో రాగి శాసనం

image

విజయనగర రాజు శ్రీరంగరాయ కాలం నాటి ఐదు పత్రాలతో కూడిన రాగి పలక శాసనం శ్రీకాళహస్తిలోని డాక్టర్ పరుశురాం గురుకుల్ ఆధీనంలో ఉంది. ఇందులో సంస్కృత భాషతో పాటు నందినాగరి అక్షరాలతో రాయబడి 1498 శకం, ధాత్రి, కార్తిక, షు 12 = 1576 C.E., నవంబర్ 3, శనివారంగా ఉంది. దీన్ని ఆర్కియాలజీ శాఖ అధికారి మునిరత్నం రెడ్డి వివరాలు వెల్లడించారు.

News November 12, 2025

మదనపల్లె కిడ్నీ రాకెట్‌లో దొరికింది వీరే.!

image

అన్నమయ్య జిల్లాలో కిడ్నీలు కొట్టేసే ముఠాను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. విశాఖకు చెందిన ఓ మహిళకు మదనపల్లెలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో <<18262668>>కిడ్నీ తొలగించగా చనిపోయింది<<>>. దీంతో వారు మృతదేహాన్ని తిరుపతికి తరలించి దహనక్రియలు చేయాలని చూశారు. ఈలోగా మృతురాలి భర్త తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గుట్టు రట్టైంది. అక్కడ కేసు నమోదుచేసి మదనపల్లెకు ట్రాన్స్‌ఫర్ చేయగా ఆ ముఠాలోని దొంగలు పట్టుబడ్డారు.