News November 1, 2025

ఆసిఫాబాద్: విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి

image

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF జిల్లా కలెక్టరేట్‌లో విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 2, 2025

మన్యం: ‘మీ కోసం వెబ్‌సైట్‌లో PGRS నమోదు చేయవచ్చు’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో PGRS ద్వారా సోమవారం అర్జీలు స్వీకరిస్తామన్నారు.

News November 2, 2025

టాస్ గెలిచిన టీమ్ ఇండియా

image

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, జితేశ్, దూబే, అక్షర్, అర్షదీప్, సుందర్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, ఓవెన్, స్టోయినిస్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, అబాట్

News November 2, 2025

వేములవాడలో విద్యుత్ స్తంభాల తరలింపు

image

వేములవాడ పట్టణంలోని మెయిన్ రోడ్డులో విద్యుత్ స్తంభాల తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన రోడ్డు వెడల్పుతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం విస్తరణ పనుల నేపథ్యంలో ఇంతకుముందు ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి అమరుస్తున్నారు. ఆలయం దక్షిణం వైపు పాత ఆంధ్రబ్యాంకు వద్ద ఆదివారం నాడు సెస్ సిబ్బంది స్తంభాలు తరలించే క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను మల్లించారు.