News November 2, 2025
ఈ దున్న ఖరీదు రూ. 23 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

హరియాణాకు చెందిన అన్మోల్ అనే ఈ దున్న రాజస్థాన్ పుష్కర్ పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1,500 Kgల బరువుండే ఈ దున్న ఖరీదు రూ.23 కోట్ల పైనే. దీని వీర్యానికి చాలా డిమాండ్ ఉంది. వారానికి 2సార్లు అన్మోల్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తారు. ఇలా నెలకు కనీసం రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి ఆహారం కోసం నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది.✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
Similar News
News November 2, 2025
‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్‌పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.
News November 2, 2025
ఈనెల 6న పార్వతీపురంలో మెగా జాబ్ మేళా

AP: పార్వతీపురంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఈనెల 6న కార్మిక& ఉపాధిశాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 6 కంపెనీలలో 740 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్ , డిగ్రీ అర్హతగల 18 నుంచి 30ఏళ్ల వయసు గలవారు హాజరుకావొచ్చు. అభ్యర్థులు ముందుగా నేషనల్ కెరీర్ సర్వీస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
News November 2, 2025
బొప్పాయి రాబడిని తగ్గించే రింగ్ స్పాట్ వైరస్

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.


