News November 29, 2025
ఈ నంబర్లు సేవ్ చేసుకోండి: ప.గో జేసీ

పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు సమస్యలపై 8121676653, 18004251291 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News December 2, 2025
ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా భీమవరం: కలెక్టర్ నాగరాణి

జిల్లా కేంద్రం భీమవరంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ఫ్రీ పట్టణంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ నయీం అస్మితో కలిసి ట్రాఫిక్ అవరోధాలు, రోడ్డు ఆక్రమణ, సక్రమ పార్కింగ్, భద్రత లేని డ్రైవింగ్ తదితర అంశాలపై చర్చించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
News December 2, 2025
పాలకొల్లు: ఏ తల్లికీ ఇలాంటి కష్టం రాకూడదు.!

పాలకొల్లులో కొడుకు చితికి తల్లి నిప్పు పెట్టిన విషాదకర ఘటన చోటుకుంది. బంగారువారి చెరువు గట్టుకు చెందిన సత్యవాణి కుమారుడు శ్రీనివాస్ తో కలిసి ఉంటోంది. భార్యతో విడాకులు తీసుకొన్న శ్రీనివాస్ మద్యానికి బానిసై అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయిన వాళ్లు లేకపోవడంతో తల్లి కైలాస రథంపై హిందూ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూపరులను కలచివేసింది.
News December 2, 2025
ఏలూరు: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్‌కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ తమపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.


