News November 12, 2025
ఈ నెల 16న సింగరేణి ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్

ఈ నెల 16న గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్‌ను నిర్వహించనున్నట్లు సింగరేణి ఆర్జీ 1 జీఎం డీ.లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీ 1, 2, 3, ఏఏల్‌పీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, CPRMSE & CPRMSNE కార్డు కలిగిన రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 12 నుంచి సింగరేణి ఆసుపత్రిలో నమోదు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.

బీజాపూర్ అడవుల్లో కాల్పుల మోత!

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతాల్లో రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ మద్దేడ్ ఏరియా కమిటీ, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మద్దేడ్ ఏరియా కమిటీ ఇన్‌ఛార్జితో బుచ్చన్నతో పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ మృతి చెందారు. ఈ విషయాన్ని బీజాపూర్ పోలీసులు ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.