News November 14, 2025
ఈ 3 కారణాలతోనే బిహార్‌లో ఓటమి: కాంగ్రెస్ లీడర్లు

బిహార్ ఎన్నికల్లో ఈసారైనా తమకు అధికారం దక్కుతుందని ఆశపడిన కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. NDA భారీ విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఊహించలేదు. బీసీ, ఈబీసీలకు దగ్గరయ్యే క్రమంలో ఉన్నత వర్గాల ఓటు బ్యాంక్ కోల్పోవడం, గతంలో ఎన్డీయేలో ఉన్న అభ్యర్థులకు టికెట్లివ్వడం, SIR, ఓట్ చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవ్వడం తమ ఓటమికి కారణాలుగా వారు భావిస్తున్నారు. కాగా NDA 200+ స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Similar News
News November 14, 2025
స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!

TG: ‘జూబ్లీహిల్స్’ గెలుపు జోష్‌లో ఉన్న CONG అదే ఊపులో లోకల్ బాడీలనూ ఊడ్చేయాలని రెడీ అవుతోంది. త్వరలో రూరల్, అర్బన్ సంస్థల ఎలక్షన్స్ రానున్నాయి. ‘జూబ్లీ’ ఓటమితో నిరాశలో ఉన్న BRSకు ఇవి అగ్ని పరీక్షేనన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది. ‘జూబ్లీ’ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని, ఈ తరుణంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.
News November 14, 2025
సుపరిపాలన, అభివృద్ధి విజయమిది: మోదీ

బిహార్ ఎన్నికల్లో విజయంపై PM మోదీ స్పందించారు. ‘సుపరిపాలన, అభివృద్ధి, ప్రజానుకూల స్ఫూర్తి, సామాజిక న్యాయం గెలిచింది. చరిత్రాత్మక, అసమాన గెలుపుతో NDAను ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజలకు సేవ చేసేందుకు, బిహార్ కోసం పని చేసేందుకు ఈ తీర్పు మాకు మరింత బలాన్నిచ్చింది’ అని ట్వీట్ చేశారు. తమ ట్రాక్ రికార్డు, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ విజన్ ఆధారంగా ప్రజలు ఓటేశారని తెలిపారు.
News November 14, 2025
ఇతిహాసాలు క్విజ్ – 66 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: విదురుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించకుండా ‘మంత్రి’ పాత్రకే ఎందుకు పరిమితమయ్యారు?
జవాబు: ధృతరాష్ట్రుడు, పాండురాజు.. ఈ ఇద్దరూ అంబిక, అంబాలిక గర్భాన జన్మించారు. కానీ, విదురుడు దాసి గర్భాన జన్మించడం వలన, ఆనాటి రాజ్యాంగ నియమం ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించే అర్హతను కోల్పోయి, మంత్రి పాత్రకే పరిమితం అయ్యారు.
<<-se>>#Ithihasaluquiz<<>>


