News November 12, 2025

‘ఉరి’ని తొలగించడంపై SCలో JAN 21న విచారణ

image

నేరాలకు విధించే మరణశిక్షలో ఉరితీసే పద్ధతిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 2026 జనవరి 21కి వాయిదా వేసింది. ఎక్కువ బాధను కలిగించే ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్, విద్యుత్ షాక్ తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పిటిషనర్ కోరారు. అయితే విచారణ వచ్చే ఏడాది చేపట్టాలన్న అటార్నీ జనరల్ వెంకటరమణి విజ్ఞప్తితో SC వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Similar News

News November 12, 2025

‘ఫ్రీహోల్డ్’ రిజిస్ట్రేషన్లపై నిషేధం పొడిగింపు

image

AP: ఫ్రీహోల్డ్(యాజమాన్య హక్కుల కల్పన) భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. వీటిపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఓ అంచనాకు రాలేకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు నిషేధాన్ని పొడిగించారు.

News November 12, 2025

SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

image

<>SBI<<>> 5కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in

News November 12, 2025

జల సంరక్షణలో తెలంగాణ నంబర్-1

image

జాతీయ జల అవార్డులు-2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ(ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ) విభాగంలో TG ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 5,20,362 పనులు పూర్తిచేసి ఈ ఘనత సాధించింది. జిల్లాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల టాప్‌లో నిలిచాయి. ఇదే కేటగిరీ మున్సిపల్ విభాగంలో రాజమండ్రి(AP) 4వ ర్యాంకు సాధించింది. దీంతో ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల నగదు బహుమతి రానుంది. ఈ నెల 18న రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేస్తారు.