News November 12, 2025
ఎకరాకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వండి: రైతులు

బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం ముప్పవరంలో నిర్వహించిన సమావేశంలో రైతులు మాట్లాడారు. ఎకరానికి రూ.50లక్షలు ఇవ్వాలని పంగులూరు మండలం ముప్పవరం, జాగర్లమూడి వారిపాలెం రైతులు చీరాల RDO చంద్రశేఖర్ నాయుడును కోరారు. తరతరాలుగా జీవనాధారంగా ఉన్న భూములు కోల్పోతున్నామని, వాటికి పరిహారంగా ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వాలన్నారు.
Similar News
News November 12, 2025
శీతాకాలంలో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే జరిగేది ఇదే?

చలికాలంలో వేడివేడిగా తినాలనే ఉద్దేశంతో చాలామంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుంటారు. పదే పదే ఆహారాన్ని వేడి చేస్తే పోషకాలు తగ్గడంతోపాటు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది. నూనెలు, మసాలాలు ఆక్సిడైజ్ అవుతాయి.
News November 12, 2025
ఇంటింటికి వెళ్లి అవగాహన: కలెక్టర్

కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. జిల్లాలో కుష్టు వ్యాధి కేసులను గుర్తించేందుకు ఈనెల 17 నుంచి 30 వరకు ఎల్.సీ.డీ.సీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వద్ద గోడపత్రిక ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలోనూ వైద్యారోగ్యశాఖ సిబ్బంది సర్వే నిర్వహిస్తారన్నారు. ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారన్నారు.
News November 12, 2025
రైతులు సేంద్రియ పద్ధతులను అనుసరించాలి: కలెక్టర్

బాపట్ల మండలం ముత్తాయపాలెంలోని లోటస్ పాండ్ రిజార్ట్‌లో సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం వాతావరణ రక్షణ, ఆరోగ్యం, ఆదాయానికి తోడ్పడుతుందని చెప్పారు. రైతులు సేంద్రియ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.


