News December 9, 2025

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 14పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 12నుంచి జనవరి 11వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. Sr అసిస్టెంట్‌కు రూ. 36,000-రూ.1,10,000, Jr అసిస్టెంట్‌కు రూ.31,000-92,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.aai.aero/

Similar News

News December 9, 2025

ఈ రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.

News December 9, 2025

నెలసరిలో నడుంనొప్పి ఎందుకు?

image

నెలసరిలో చాలామందికి నడుంనొప్పి వస్తుంది. నెలసరిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయం లైనింగ్ తొలగించి, గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. ఈ సంకోచాల కారణంగా నడుం కండరాలపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలంలో ఉంటుంది. ఇలా అసాధారణ కణజాల పెరుగుదల వల్ల నెలసరి సమయంలో నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

News December 9, 2025

శంషాబాద్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్

image

TG: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉందని, పేలుడు జరగకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్ అమెరికాకు చెందిన జాస్పర్ పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు.