News February 27, 2025
ఎస్.రాయవరం: తాటి చెట్టు నుంచి జారిపడి యువకుడి మృతి

ఎస్.రాయవరం మండలం పి.ధర్మవరంలో బుధవారం తాటి చెట్టు ఎక్కి ఆకులు కోస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు ఎస్ఐ విభీషణరావు తెలిపారు. పెనుగొల్లుకు చెందిన చిందాడ శ్రీను (27) కూలి పని కోసం తాటి చెట్టు ఆకులు కోసేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కి ఆకులు నరుకుతుండగా చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
Similar News
News February 27, 2025
సూర్యాపేట: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్‌లోని సూర్యాపేట, కోదాడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.
News February 27, 2025
నిర్మల్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో ఉదయం 10 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 1,206 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 7.04 శాతంగా పోలింగ్ నమోదయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 201 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 10.22 శాతం పోలింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.
News February 27, 2025
జగిత్యాల:10AM వరకు పోలింగ్ శాతం నమోదు వివరాలు

జగిత్యాల జిల్లాలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం గురువారం ఉదయం 10 గంటల వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. టీచర్ ఎమ్మెల్సీకి 9.67 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ శాతం 6.43% నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తంగా రెండు కలిపి 6.58% పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.