News November 12, 2025
ఏలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

వివేకా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సుదీప్ బోరో (30) మృతి చెందాడు. మాల్దా జిల్లాకు చెందిన ఇతను చెంగనూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోకి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం స్టేషన్ మాస్టర్ సమాచారంతో రైల్వే హెచ్‌సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 12, 2025
ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.
News November 12, 2025
ఉట్నూర్: తండ్రిని చంపిన కొడుకుకి 7ఏళ్ల జైలు శిక్ష

ఉట్నూర్ మండలం రాజన్న గూడకు చెందిన గడ్డం భగవాన్ 2024 సెప్టెంబర్ 13న మద్యం మత్తులో తండ్రిని చంపాడు. డబ్బుల కోసం తలపై దాడిచేయడంతో చికిత్స పొందుతూ అతడి తండ్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఉట్నూర్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అతడికి 7ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.
News November 12, 2025
ఢిల్లీ పేలుడు.. ఆ టెర్రరిస్టుకు మరో కారు?

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలిన హ్యుందాయ్ i20 కారుతో పాటు మరో కారు <<18256986>>టెర్రరిస్టుకు <<>>ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంకో వాహనాన్ని కూడా ఉపయోగించాడని నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీసు బృందాలు Ford కంపెనీకి చెందిన EcoSport రెడ్ కలర్ కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఉమర్ నబీ పేరుతో ఆ కారు(DL10CK0458) ఉన్నట్లుగా జాతీయ మీడియా వెల్లడించింది.


