News November 14, 2025

ఒంటరిగా వెళుతున్న ఎంపీ.. కలిసిరాని ఎమ్మెల్యేలు!

image

కాకినాడ MP ఉదయ శ్రీనివాస్ జిల్లాలో ఒంటరిగానే పర్యటనలకు వెళ్తున్నారు. కాకినాడ(R)లో జనసేన MLA ఉన్నప్పటికీ ఆయన కూడా ఎంపీతో కలవడం లేదట. పిఠాపురంలో మాజీ MLA దొరబాబు మాత్రమే MP వెంట వస్తున్నారు. మాజీ MLA వర్మ, సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో ఈయనకు విభేదాలున్నాయి. మిగతా చోట్ల కూడా MLAలు సహకరించడం లేదని, MP కూడా కలుపుగోలుతనంగా ఉండరనే టాక్ ఉంది. దీంతో MP నిధులతో చేపట్టే పనులకు ఆయనే శంకుస్థాపనలు చేసుకుంటున్నారు.

Similar News

News November 14, 2025

HYD: 750 వాహనాలు సీజ్: ఆర్టీఏ అధికారులు

image

నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రెండు రోజులుగా 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో 750 వాహనాలను సీజ్ చేశామని, ఓవర్ లోడ్ వాహనాలను క్వారీలు, రీచ్‌ల వద్దనే నియంత్రించేందుకు మైనింగ్ శాఖకు ఆర్టీఏ అధికారులు సిఫార్సు చేశారు.

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద, సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 84,237 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, ఐటీ, ఆటో, FMCG స్టాక్స్ ఎరుపెక్కాయి. ముత్తూట్ ఫిన్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.