News February 27, 2025

కడెం: వ్యవసాయ బావిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య…!

image

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. SI కృష్ణసాగర్‌రెడ్డి కథనం ప్రకారం.. పాత మద్దిపడగ గ్రామానికి చెందిన బాతెం నర్సయ్య(67) మద్యానికి బానిసై ఇంట్లో తరచూ డబ్బులు అడిగేవాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.

Similar News

News February 27, 2025

తూ.గో: నేడే MLC ఎలక్షన్.. సర్వం సిద్ధం

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. గోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 70 జోన్లలో 70 జోనల్ అధికారులు, 95మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.

News February 27, 2025

భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

image

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI వివరించారు.

News February 27, 2025

KNR: MLC ఓటు ఎలా వేయాలో తెలుసా..?

image

✓మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు, ఫోటోస్ ఉంటాయి✓మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నంబర్ వేయాలి✓ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు కూడా వేయవచ్చు✓పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి✓వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి✓బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి✓బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు, క్రమ సంఖ్య చూసుకోండి.

error: Content is protected !!