News December 9, 2025
కరీంనగర్: ఉప సర్పంచ్ కుర్చీకి రూ.5- 10 లక్షలు..?

పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి కారణం జాయింట్ చెక్ పవర్ ఉండటమే. ఈ కుర్చీని దక్కించుకోవడానికి ఆశావహులు వార్డు మెంబర్ స్థానంలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో ఈ పదవి కోసం ఏకంగా రూ.5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వార్డు సభ్యులను తమవైపు తిప్పుకోవడానికి నగదు ఆఫర్లు, రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం స్థానికంగా ఎన్నికల వేడిని రాజేస్తోంది.
Similar News
News December 9, 2025
దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.
News December 9, 2025
బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

ఆర్‌కే బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్‌ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
News December 9, 2025
స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.


