News November 12, 2025
కరీంనగర్: లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ

సమాజంలో అవినీతి పెద్ద సమస్యగా మారిందని, దాన్ని అరికట్టే శక్తి మన చేతుల్లోనే ఉందిని ఉమ్మడి కరీంనగర్ ACB డీఎస్‌పీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. లంచం అడగడం.. లంచం తీసుకోవడం.. లంచం ఇవ్వడం కూడా నేరమన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి మీ నుంచి లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.
Similar News
News November 12, 2025
5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని 5 విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. HYD, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామని దుండగుల నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ HYD సహా మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు నిర్వహిస్తోంది.
News November 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 64 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని పరశురాముడు ఎలా గుర్తించాడు?
జవాబు: ఓరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ పురుగు కర్ణుడి తొడను రక్తం వచ్చేలా కుట్టింది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరించాడు. రక్తపు ధార తగిలి పరశురాముడు మేల్కొని, ఆ దారుణమైన బాధను సహించే శక్తి క్షత్రియుడికి తప్ప వేరొకరికి ఉండదని గుర్తించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 12, 2025
బిక్కనూర్: కుల బహిష్కరణ.. ఐదుగురిపై కేసు

కుల బహిష్కరణకు పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని రిమాడ్‌కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. SI తెలిపిన వివారాలు.. జంగంపల్లికి చెందిన దొడ్లే గౌరవ్వ మంత్రాలు చేస్తోందనే నెపంతో కుల సభ్యులు ఆమెకు రూ.2.75 లక్షలు జరిమానా విధించారు. ఆమె నుంచి బలవంతంగా రూ.15 వేలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె బుధవారం పోలీసులను ఆశ్రయించింది.


