News November 14, 2025
కల్లెడలో పట్టపగలే భారీ చోరీ..!

వరంగల్ జిల్లా పర్వతగిరి(M) కల్లెడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి ఆదొండ సాయిలు ఇంట్లో చోరీకి పాల్పడి రూ.6 లక్షల నగదు, 25 తులాల బంగారు వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు పర్వతగిరి సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పట్టపగలే భారీ చోరీ జరగడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Similar News
News November 14, 2025
ములుగు జిల్లాలో 8663 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు

మధుమేహం.. షుగర్ వ్యాధిగా పిలుచుకునే ఈ రుగ్మత అతివేగంగా వ్యాపిస్తోంది. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరికీ సోకుతోంది. పసిబిడ్డలకు కూడా షుగర్ వ్యాధి బయటపడటం ఆందోళనకరం. ములుగు జిల్లాలో 8663 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. క్రమంతప్పని వ్యాయామం, సంతులిత ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్‌ను అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈరోజు ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం.
News November 14, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
➤ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు పోటీలు
➤ అనకాపల్లిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు
➤ డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నర్సీపట్నంలో పోలీసుల సైకిల్ ర్యాలీ
➤ వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమాలు
➤ రాజయ్యపేటలో మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన
➤ మాడుగుల అభివృద్ధి బ్రోచర్‌ను మంత్రి లోకేశ్‌కు అందజేసిన ఎమ్మెల్యే
News November 14, 2025
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబసైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.


