News November 12, 2025
కాకినాడ జిల్లాలో సెక్షన్ 30 అమలు

కాకినాడ జిల్లాలో మంగళవారం నుంచి సెక్షన్ 30 అమలులోకి తెచ్చినట్లు ఎస్పీ బిందు మాధవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, నిరసనలు, ఆందోళనలు నిర్వ హించడానికి వీలు లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News November 12, 2025
తెలంగాణలో ప్రకాశం జిల్లా వాసి మృతి

ప్రకాశం జిల్లా వాసి జగిత్యాల జిల్లాలో మృతి చెందిన ఘటన మంగళవారం జరింగింది. జిల్లాలోని బీర్పూర్ (M) చిన్నకొల్వాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ బావిలో పడి వలస కూలీ మృతి చెందాడు. కాగా మృతుడు ప్రకాశం జిల్లా కలికివాయ బిట్రగుంటకి చెందిన రామకృష్ణ(52)గా గుర్తించారు. ఇతనితోపాటు మరికొంతమంది బావిలో ఇసుక పూడిక తీస్తుండగా రామకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో మృతి చెందాడు. కాగా బీర్పూర్ SI, పరిశీలించి కేసు నమోదు చేశారు.
News November 12, 2025
జల సంరక్షణలో తెలంగాణ నంబర్-1

జాతీయ జల అవార్డులు-2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ(ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ) విభాగంలో TG ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 5,20,362 పనులు పూర్తిచేసి ఈ ఘనత సాధించింది. జిల్లాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల టాప్‌లో నిలిచాయి. ఇదే కేటగిరీ మున్సిపల్ విభాగంలో రాజమండ్రి(AP) 4వ ర్యాంకు సాధించింది. దీంతో ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల నగదు బహుమతి రానుంది. ఈ నెల 18న రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేస్తారు.
News November 12, 2025
టెన్త్ పరీక్ష ఫీజు రూ.50

వచ్చేఏడాది జరగనున్న టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు తేదీని ఇన్‌ఛార్జ్ DEO పాటిల్ మల్లారెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 25 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 రుసుముతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.200తో 10వ తేదీ వరకు, రూ.500తో 15వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125, ఒకసారి ఫెయిలైన వారు 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలన్నారు.


