News November 12, 2025

కానూరులో భారీగా గంజాయి పట్టివేత

image

విజయవాడలోని కానూరులో బుధవారం పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 లక్షలు విలువ చేసే 249 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈగల్ & రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా జరిపిన దాడులలో ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిశాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరు విజయవాడ, ముగ్గురు ఒడిశాకు చెందిన మొత్తం ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News November 13, 2025

HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

image

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News November 13, 2025

ఢిల్లీ పేలుడు: 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

image

టెర్రరిస్టులు బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా పేలుడు పదార్థాలను దేశంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 3,200KGs <<18254431>>అమ్మోనియం నైట్రేట్<<>> కన్‌సైన్మెంట్‌ రాగా, అందులో 2,900KGs స్వాధీనం చేసుకున్నారు. మరో 300KGs దొరకలేదు. అది ఎక్కడుందో తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) దేశవ్యాప్తంగా దాడులకు ఉమర్ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

News November 12, 2025

ఏలూరు: గ్రంథాలయ భవనాన్ని తనిఖీ చేసిన జేసీ

image

ఏలూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి, శిథిలావస్థలో ఉన్న భవన పరిస్థితిని పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణకు అనుకూలమైన వసతి అంశాన్ని త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, సేవలను విస్తృత పరిచేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.