News November 14, 2025

కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం తీవ్రం

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. కనిష్టంగా ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. బొమ్మన్ దేవిపల్లి,గాంధారి,బీబీపేట లో 9.4°C, నస్రుల్లాబాద్ 9.5, జుక్కల్ 9.7, మేనూర్,రామలక్ష్మణపల్లి, లచ్చపేట లో 9.8, డోంగ్లి,సర్వాపూర్ లో 9.9, ఎల్పుగొండ, బీర్కూర్ లో10.1, నాగిరెడ్డిపేట 10.5, పుల్కల్ 10.7, లింగంపేట,బిచ్కుంద,రామారెడ్డి లో 10.8, భిక్కనూర్ 11°C లుగా నమోదయ్యాయి.

Similar News

News November 14, 2025

WGL: గృహజ్యోతి లబ్ధిదారుడికి రూ.1,34,517 బిల్లు

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామానికి చెందిన గృహజ్యోతి లబ్ధిదారుడు దేవేందర్ రావుకు ఒక్కసారిగా రూ.1,34,517 విద్యుత్‌ బిల్లు రావడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. గతంలో మీటర్‌లో సమస్య ఉందని, విద్యుత్ సిబ్బంది పరీక్షించి ఎలాంటి లోపం లేదని చెప్పి తిరిగి బిగించి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ భారీగా బిల్లు రావడంతో మీటర్‌ను మళ్లీ టెస్టింగ్‌కు పంపిస్తామని చెబుతున్నారు.

News November 14, 2025

ఇక బెంగాల్ వంతు: కేంద్ర మంత్రి

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, ఇక తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బిహార్ నిర్ణయించుకుంది. ఇక్కడి యువత తెలివైనది. ఇది అభివృద్ధి సాధించిన విజయం. బెంగాల్‌లో అరాచక ప్రభుత్వం ఉంది. అక్కడా మేం గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వచ్చే ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

News November 14, 2025

కోరుట్ల నుంచి RTC వన్డే SPL. TOUR

image

కోరుట్ల నుంచి ఈనెల 16న మాహోర్‌కు స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటలకు బస్సు బయలుదేరి రేణుకా మాతా(మావురాల ఎల్లమ్మ, పరశురామ), దత్తాత్రేయ పీఠం, ఏకవీర శక్తిపీఠం, ఉంకేశ్వర్- శివాలయం దర్శనాల అనంతరం బస్సు తిరిగి రాత్రి కోరుట్లకు చేరుతుందన్నారు. ఛార్జీలు ఒక్కరికి రూ.1,250గా నిర్ణయించారు. వివరాలకు 996361503 నంబర్‌ను సంప్రదించాలన్నారు.