News November 12, 2025
కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో పెండింగ్‌లోని దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టొద్దని గట్టిగా చెప్పారు.
Similar News
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.

బీజాపూర్ అడవుల్లో కాల్పుల మోత!

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతాల్లో రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ మద్దేడ్ ఏరియా కమిటీ, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మద్దేడ్ ఏరియా కమిటీ ఇన్‌ఛార్జితో బుచ్చన్నతో పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ మృతి చెందారు. ఈ విషయాన్ని బీజాపూర్ పోలీసులు ధ్రువీకరించారు. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.