News December 6, 2025
కృష్ణా: వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షలపై అవగాహన కల్పించరా.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం అన్ని సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. DEC 2-6 మధ్య తొలివిడత పరీక్షలు జరుగుతుండగా, ఎన్టీఆర్ జిల్లాలో 84 వేలు, కృష్ణాలో 50 వేల మంది అర్హులున్నారు. అయితే కొందరు నిరుద్యోగులు తమకు సమాచారం లేదని వాపోతున్నారు. అధికారులు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కంపెనీలు జాబ్స్ ఇవ్వనున్నాయి.
Similar News
News December 7, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 7, 2025
గ్లోబల్ సమ్మిట్ అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపిక

ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే వివిధ రాష్ట్రాల CMలు, ప్రత్యేక అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సొసైటీ జ్ఞాపికలను బహూకరించనుంది. ఫిలిగ్రీ కళతో వెండితీగ నగిషీ పనితో రూపొందించిన బుద్ధుని ప్రతిమలను అందించనున్నారు. సొసైటీకి దాదాపు 100 జ్ఞాపికల తయారీకి అవకాశం లభించగా, వీటి తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. ఒక్కో కళాఖండం విలువ రూ.35 వేలు ఉంటుంది.
News December 7, 2025
తిరుపతిలో సంచలన ఘటన.. MP కీలక నిర్ణయం

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇద్దరు అ.ఫ్రొఫెసర్లు విద్యార్థినిని <<18490909>>లైంగికంగా<<>> వేధించారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనను MP డాక్టర్ గురుమూర్తి నేషనల్ కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖలు రాశారు. ఈ మేరకు బాధిత యువతికి న్యాయం చేయాలని ఆయన కోరారు.


