News December 7, 2025

కృష్ణా: వసతి గృహాల పర్యవేక్షణకు యాప్

image

వసతి గృహాల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HPTS అనే ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా అధికారులు వసతి గృహాల్లోని సేవలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. రోజువారీ, వారాంతపు నిర్వహణ పనులను తప్పనిసరిగా ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

Similar News

News December 7, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 7, 2025

గ్లోబల్ సమ్మిట్‌ అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపిక

image

ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే వివిధ రాష్ట్రాల CMలు, ప్రత్యేక అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సొసైటీ జ్ఞాపికలను బహూకరించనుంది. ఫిలిగ్రీ కళతో వెండితీగ నగిషీ పనితో రూపొందించిన బుద్ధుని ప్రతిమలను అందించనున్నారు. సొసైటీకి దాదాపు 100 జ్ఞాపికల తయారీకి అవకాశం లభించగా, వీటి తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. ఒక్కో కళాఖండం విలువ రూ.35 వేలు ఉంటుంది.

News December 7, 2025

తిరుపతిలో సంచలన ఘటన.. MP కీలక నిర్ణయం

image

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇద్దరు అ.ఫ్రొఫెసర్లు విద్యార్థినిని <<18490909>>లైంగికంగా<<>> వేధించారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనను MP డాక్టర్ గురుమూర్తి నేషనల్ కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖలు రాశారు. ఈ మేరకు బాధిత యువతికి న్యాయం చేయాలని ఆయన కోరారు.