News December 7, 2025
కొత్తగూడెం: వామ్మో.. రూ.12.35 లక్షల కరెంటు బిల్లు హా

ప్రతినెల వేలల్లో వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.12,35,191 రావడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన షాపు నిర్వాహకుడు అశోక్ ఆందోళనకు గురయ్యారు. గత నెలలో రూ.40,063 ఉన్న బిల్లు ఈ నెలలో లక్షల్లో చేరడాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని, సరిచేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
నల్గొండ: ఇవాళ సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రం తెర పడనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. NLG జిల్లాలో 14 మండలాల్లో 318, SRPT జిల్లాలో 159, యాదాద్రి జిల్లాలో 138 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈసారి ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతుదారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.
News December 9, 2025
గడప పూజ ఎప్పుడు చేయాలి?

మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అదే రోజు గడప పూజ కూడా చేస్తే పూజా ఫలంతో పాటు లక్ష్మీ వ్రత ఫలితం కూడా లభిస్తుందని నమ్మకం. శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాల్లో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజు కూడా ఈ పూజ ప్రారంభించడం శుభకరమేనని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకు అధిక ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ద్వార లక్ష్మీ పూజ వరుసగా 16 రోజులు చేయాలి.
News December 9, 2025
జిల్లాగా ఆదోని.. మీరేమంటారు?

ఆదోని జిల్లా సాధనకు పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు నిరసనలు చేస్తున్నారు. అధికారి పార్టీ నాయకులు సైతం నిరసన వ్యక్తం చేస్తుండటంతో CM ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ అంశం తన దృష్టికే రాలేదని అన్నట్లు వార్తలు వచ్చాయి. మరోపక్క MLC BT నాయుడు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదోని జిల్లాకు CMను విన్నవించారు. ఆదోని జిల్లా ఏర్పాటుపై మీరేమంటారు?


