News December 8, 2025

ఖమ్మం: తొలి విడతలోనే అతి పెద్ద పంచాయతీ పోరు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 40,761 మంది ఓటర్లు ఉన్న భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీకి డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అతిపెద్ద పోలింగ్ కేంద్రంగా నిలిచిన ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. న్యాయపరమైన చిక్కుల తర్వాత ప్రస్తుతం ఒకే పంచాయతీగా పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్‌కు 5, 20 వార్డులకు 75 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోరు ఉత్కంఠగా మారింది.

Similar News

News December 9, 2025

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి: కలెక్టర్ కీర్తి

image

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్‌కెవిటి కళాశాలలో మంగళవారం సీడబ్ల్యూఎస్‌ఎన్ (CWSN) జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. ఆటల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బహుమతులు అందజేశారు.

News December 9, 2025

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

image

ఆసియాలోనే తమ అతిపెద్ద పెట్టుబడి భారత్‌లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇండియాలో AIకి ఊతమిచ్చేలా 17.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దేశంలో AI అభివృద్ధికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.

News December 9, 2025

జిల్లాకు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి: ఎంపీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని అమలాపురం ఎంపీ హరీశ్ లోక్‌సభలో 377 నిబంధన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో వైద్య సదుపాయాల లోపం, ట్రామా కేంద్రాలు లేకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. మంజూరైన క్యాన్సర్ డే సెంటర్‌ను వేగంగా నిర్మించాలని ఎంపీ కోరారు.