News November 12, 2025

గజం రూ.3.40 లక్షలు.. 8 ఏళ్లలో 4 రెట్లు

image

TG: రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ(HKC)లో గజం ధర రూ.3.40 లక్షలు పలికినట్లు TGIIC ఎండీ శశాంక తెలిపారు. 2017లో అక్కడ రూ.88వేలుగా ఉన్న ధర ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం 4,770 గజాల స్థలాన్ని రూ.159 కోట్లకు విక్రయించామన్నారు. ఇక కోకాపేట, మూసాపేటలోని ఖాళీ ప్లాట్ల వేలం కోసం ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న టీహబ్‌లో నిర్వహించనున్నట్లు HMDA ప్రకటించింది.

Similar News

News November 12, 2025

బ్యాంకుకు ‘లంచ్ బ్రేక్’ ఉంటుందా?

image

బ్యాంకు సర్వీస్‌లో లంచ్ బ్రేక్ ఉండదు. RBI ప్రకారం పబ్లిక్, ప్రైవేట్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్‌డ్ టైమ్ లేదు. భోజన సమయంలో కౌంటర్లన్నీ మూసివేయకూడదు. లంచ్‌ సమయంలోనూ ఎవరో ఒకరు రొటేషనల్ పద్ధతిలో కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లంచ్ బ్రేక్‌ పేరుతో ఇబ్బంది పడితే RBI కస్టమర్‌ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది. SHARE

News November 12, 2025

ట్రాఫిక్‌లోనే 117 గంటల జీవితం

image

వాహనాల ట్రాఫిక్‌లో బెంగళూరు దేశంలోనే టాప్‌లో నిలిచింది. అక్కడ ఒక్కో ప్రయాణికుడు ఏడాదిలో సగటున 117 గంటలు ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా(110), పుణే(108), ముంబై(103), చెన్నై(94), హైదరాబాద్(85), జైపూర్(83), ఢిల్లీ(76), అహ్మదాబాద్(73) ఉన్నాయి. ఇక 10KM ప్రయాణానికి బెంగళూరులో 34ని.10 సెకన్లు పడుతుండగా, HYDలో 31ని.30 సెకన్లు పడుతున్నట్లు తేలింది.

News November 12, 2025

600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>RITES<<>>లో 600 సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. NOV 23న రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.rites.com/