News November 1, 2025
గడ్డెన్న ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

భైంసా గడ్డెన్న ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు మూడో విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడం వల్ల వరద గేట్ల నుంచి ఏ క్షణమైనా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోకి పశువుల కాపరులు, రైతులు ఎవరూ వెళ్లకూడదని ఆయన సూచించారు.
Similar News
News November 2, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా.!

వరంగల్ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ KG రూ.200- రూ.220 మధ్య ధర పలుకుతోంది. స్కిన్ లెస్ కేజీ రూ.230- రూ.250 ధర పలుకుతోంది. లైవ్ కోడి కేజీ రూ.160-రూ.170 మధ్య ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-రూ.20 వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం కార్తీక మాసం నేపథ్యంలో అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News November 2, 2025
మణికొండలో రూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

HYD మణికొండలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి, పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి హైడ్రా విముక్తి చేసింది. పశ్చిమ ప్లాజా సమీపంలో ఎలాంటి పత్రాలు లేని ఎకరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, కబ్జాదారులను ఖాళీ చేయించింది. వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్‌లోని మొత్తం 7,650 గజాల రెండు పార్కు స్థలాలను కూడా హైడ్రా తిరిగి తీసుకుంది. ఈ స్థలాల్లో హైడ్రా బోర్డులు, ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది.