News November 12, 2025

చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

image

HYDలోని చంచల్‌గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 12, 2025

పెద్దపల్లి: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

image

అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్‌ను బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) దాసరి వేణు ఆవిష్కరించారు. వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. వయోవృద్ధులు తమ సమస్యలపై టోల్ ఫ్రీ నం.14567ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (ఇన్‌ఛార్జ్) కవిత, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత పాల్గొన్నారు.

News November 12, 2025

GWL: ‘యు-డైస్ వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి’

image

గద్వాల జిల్లాలోని పాఠశాలలకు సంబంధించిన యు-డైస్ (U-DISE) వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతుల వివరాలను యు-డైస్‌లో పొందుపరచాలన్నారు. వాస్తవ పరిస్థితులను మాత్రమే నమోదు చేయాలని ఆయన సూచించారు.

News November 12, 2025

GWL: ‘నీటి వనరుల గణన పకడ్బందీగా చేపట్టాలి’

image

జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో దేశవ్యాప్తంగా ఐదేళ్లకోసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్ రెండో బాడీస్ గణనపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్న నీటి వనరుల గణన ప్రక్రియను ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు.