News November 14, 2025

ఛైర్మన్ హోదాలో నేనే పర్యవేక్షిస్తా: సీఎం చంద్రబాబు

image

9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే మోడల్ అని అన్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్‌ను నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి విడుదల చేశారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా, భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామన్నారు.

Similar News

News November 14, 2025

ప్రతిరోజూ ABC జ్యూస్ తాగితే జరిగేది ఇదే

image

ABC జ్యూస్.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేస్తారు. షుగర్, విటమిన్లు, ఖనిజాలు, 0.5గ్రా. ప్రొటీన్స్ లభించే ఈ జ్యూస్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. పరగడుపున తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖం యంగ్‌గా కనిపిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువ ఉన్నందున బరువు తగ్గుతారు. 100మి.లీ జ్యూస్‌లో 45-50 కేలరీలు, 10-12గ్రా. కార్బోహైడ్రేట్లు బాడీకి అందుతాయి.

News November 14, 2025

కొడంగల్: శారీరక దృఢత్వానికి కలరిపయట్టు దోహదం..!

image

కొడంగల్ పరిధి హస్నాబాద్‌లో మూడు రోజులుగా కలరిపయట్టు శిక్షణ కొనసాగుతోంది. ఇటివలే గ్రామానికి వచ్చిన సినీ నటుడు ప్రభాకర్ గ్రామ పంచాయతీ ఆవరణలో కొనసాగుతున్న శిక్షణలో శిక్షకులతో ముచ్చటించారు. కలరిపయట్టు విద్య నేర్చుకోవడంతో శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత లాంటి అంశాలపై దృష్టి సారించవచ్చన్నారు. కలరిపయట్టు అనేది కేరళలో ఉద్భవించిన ఒక పురాతన భారతీయ యుద్ధ కళ అని శిక్షకుడు రమేశ్ వివరించారు.

News November 14, 2025

పెరగనున్న ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు!

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రానున్నట్లు తెలుస్తోంది. 2025-27 పీరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజుల ప్రతిపాదలను టీఏఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి పంపగా ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటంతో జీవో నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసీ అనుమతితో విడుదల చేయనుంది.