News November 1, 2025
జగిత్యాల మార్కెట్లో నేటి దినుసుల ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2051, కనిష్ఠ ధర ₹1716, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1871, కనిష్ఠ ధర ₹1725, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర ₹2511, కనిష్ఠ ధర ₹2251, వరి ధాన్యం (BPT) ధర ₹2031, కనిష్ఠ ధర ₹2021గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్‌ఫెడ్ ద్వారా 196.00 క్వింటాళ్ల మక్కల కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది: కేటీఆర్

మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల BRS కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలన్నారు.
News November 2, 2025
సారంగాపూర్: చిన్నారిపై విరుచుకోపడ్డ కుక్కలు

సారంగాపూర్ మండలం బీరవెల్లిలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సయ్యద్ సహాద్(1) పై దాడి చేయడంతో బాబు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. నిత్యం కుక్కల దాడులు పెరుగుతున్నాయని వాపోయారు.
News November 2, 2025
క్రీడా సంఘాల వివరాలు ఇవ్వండి: DYSO

సిద్దిపేట జిల్లాలోని క్రీడా సంఘాలు తమ వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య కోరారు. రానున్న సీఎం కప్‌ను దృష్టిలో ఉంచుకుని, క్రీడా సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలు, కార్యవర్గ సభ్యుల వివరాలను ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా క్రీడా శాఖ కార్యాలయంలో అందజేయాలి. మరింత సమాచారం కోసం 9441925763 నంబర్‌కు సంప్రదించవచ్చని చెప్పారు.


