News December 4, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1903, కనిష్ఠ ధర రూ.1750; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2052, కనిష్ఠ ధర రూ.2005; వరి ధాన్యం (BPT) ధర రూ.2100; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3014, కనిష్ఠ ధర రూ.2651గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News December 7, 2025

చొప్పదండి జవహర్ నవోదయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

image

జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. తమకు, విద్యాలయానికి ఉన్న ఆత్మీయ, అనుబంధ, మధురస్మృతులను విద్యార్థులతో పంచుకున్నారు. ప్రిన్సిపల్ కె.బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. 1986లో ఏర్పాటైన నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఇచ్చాయని, దీనికి పూర్వ విద్యార్థులే నిదర్శమని అన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కె.వి.ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 7, 2025

బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

image

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్‌ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్‌తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

News December 7, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ ఎన్నికల వ్యయ పరిమితులు అమలు చేయాలి: ఎన్నికల వ్యయ పరిశీలకులు
✓ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
✓ మణుగూరు: BRS ప్రచార వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
✓ దమ్మపేట: కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన 45 కుటుంబాలు
✓ ఓటును నోటుకు మధ్యానికి అమ్ముకోవద్దు: పినపాక ఎస్సై
✓ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: భద్రాచలం ఎస్సై
✓ అశ్వరావుపేట: గుండెపోటుతో యూటీఎఫ్ నాయకుడు మృతి