News November 12, 2025

జాతీయ క్రీడలకు కుల్కచర్ల విద్యార్థి ఎంపిక

image

కుల్కచర్లకు చెందిన క్రీడాకారుడు పార్థసారథి రాష్ట్రస్థాయి పెన్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి, నవంబర్ 15న ఢిల్లీలో జరగబోయే నేషనల్ పెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతా యువతను క్రీడాకారులుగా మారుస్తున్నామన్నారు.

Similar News

News November 12, 2025

కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డి చెప్పింది ఇదేనా.?

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో TTD మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రమేయం లేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. <<18262552>>హైకమాండ్<<>>(బోర్డ్/ పొలిటికల్) నిర్ణయాల మేరకే టెండర్లకు ఆమోదం తెలిపామని, రూల్స్‌కు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం.

News November 12, 2025

‘ఉరి’ని తొలగించడంపై SCలో JAN 21న విచారణ

image

నేరాలకు విధించే మరణశిక్షలో ఉరితీసే పద్ధతిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 2026 జనవరి 21కి వాయిదా వేసింది. ఎక్కువ బాధను కలిగించే ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్, విద్యుత్ షాక్ తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పిటిషనర్ కోరారు. అయితే విచారణ వచ్చే ఏడాది చేపట్టాలన్న అటార్నీ జనరల్ వెంకటరమణి విజ్ఞప్తితో SC వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

News November 12, 2025

విజయవాడలో RTC బంపర్ ఆఫర్..!

image

విజయవాడ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు అర్ధరాత్రి వరకు చెల్లుబాటు అయ్యే ట్రావెల్ యాజ్ యూ లైక్ (TAYL) టికెట్ ఇకపై తీసుకున్న సమయం నుంచి 24 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది. కేవలం రూ.100 చెల్లించి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి దానం తెలిపారు.