News December 9, 2025

జిల్లాకు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి: ఎంపీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని అమలాపురం ఎంపీ హరీశ్ లోక్‌సభలో 377 నిబంధన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో వైద్య సదుపాయాల లోపం, ట్రామా కేంద్రాలు లేకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. మంజూరైన క్యాన్సర్ డే సెంటర్‌ను వేగంగా నిర్మించాలని ఎంపీ కోరారు.

Similar News

News December 9, 2025

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ASF SP

image

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ASF SP నితికా పంత్ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో 5 మండలాల్లో 11న జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

News December 9, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: వరంగల్ సీపీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 11న జరిగే మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

VZM: జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం

image

ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం తాత్కాలిక న్యాయ సహాయ కేంద్రం ప్రారంభిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మంగళవారం తెలిపారు. ప్రజలకు న్యాయ సహాయం, మానవహక్కులపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా చూడడం, అవసరమైన సలహాలు అందించడం కార్యక్రమ లక్ష్యం అని చెప్పారు.