News November 14, 2025

జిల్లాలో 74,349 MTల ధాన్యం సేకరణ

image

సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 11,905 మంది రైతుల నుంచి 74,349 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గురువారం ఒక్కరోజే 5142 MTల ధాన్యంను కొనుగోలు చేశారు. మొత్తం ధాన్యంలో 2528 MTల సన్న రకం, 71,820 MTల దొడ్డు రకం ధాన్యం ఉన్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.177.62 కోట్లు కాగా, ఇందులో రూ.69.76 కోట్లు చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి.

Similar News

News November 14, 2025

WGL: నివేదిక ఆధారంగానే విజిలెన్స్ విచారణ!

image

ఎంజీఎం ఆసుపత్రిలో నిధుల కుంభకోణం జరిగిందంటూ<<18275353>> Way2Newsలో వచ్చిన కథనం<<>>పై డీఎంఈ విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ విచారణలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తొలి రోజు విచారణలో చాలా వరకు ఓచర్లు లేకుండానే చెల్లింపులు జరిపినట్టు తేలింది.మరో 2 రోజుల పాటు విచారణ జరుగుతుందని సమాచారం. మొత్తానికి రూ.29 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు తెలుస్తోంది.

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్‌కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.

News November 14, 2025

బిహార్: మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకుపోతోంది. లీడింగ్‌లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. ప్రస్తుతం NDA 155, MGB 65, JSP 3స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే BJP:78, JDU: 65, RJD:59, కాంగ్రెస్: 11.