News November 1, 2025
జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో గర్రెపల్లి సత్తా

రెండ్రోజులుగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి క్రీడాకారులు సత్తా చాటారు. షటిల్ విభాగంలో గర్రెపల్లి నుంచి పలు జట్లు పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. నిర్వాహకులు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్న క్రీడాకారులను గర్రెపల్లి గ్రామస్తులు అభినందించారు.
Similar News
News November 2, 2025
గుడ్‌న్యూస్.. జెప్టోలో ఆ ఛార్జీలు ఉండవు!

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్లపై హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్, రెయిన్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇకపై ₹99 కంటే ఎక్కువున్న ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. ‘10 నిమిషాల డెలివరీ’ మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹99 కంటే తక్కువ ఉన్న ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఫీజు వసూలు చేయనుంది.
News November 2, 2025
NRPT: పెళ్లై నెలకాలేదు.. యువకుడి ఆత్మహత్య..!

పెళ్లై నెలరోజులు గడవకముందే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. నారాయణపేట(D) కోస్గి మం. నాచారంకి చెందిన రాములు(25) HYDలోని ప్రైవేట్ స్కూల్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెలరోజుల కిందే వివాహం జరిగ్గా.. ఈ మధ్యే భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. ఏమైందో తెలీదుకాని నిన్నరాత్రి అక్కడే చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.


