News November 14, 2025
జిల్లా వ్యాప్తంగా పంచారామాలకి బస్సులు

పంచారామ క్షేత్రాల దర్శనానికి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి ఎస్‌కే షబ్నం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News November 14, 2025
రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తొట్టిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ట్రాక్‌మెన్ వివరాల మేరకు.. మృతుడు పొట్టిపాడుకు చెందిన మజ్జి శీను (62) ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెచ్‌సీ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 14, 2025
17న ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ మహిళలు, పురుషులు, 19 సంవత్సరాల లోపు బాల, బాలికలు క్రీడాకారుల ఎంపిక ఈ నెల 17న మెదక్ గుల్షన్ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ కె.ప్రభు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు మెదక్ బస్ డిపో వద్ద గల గుల్షన్ క్లబ్‌లో ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94404 90622 సంప్రదించాలన్నారు.
News November 14, 2025
జిల్లా ప్రజలకు సురక్షిత నీటిని అందించాలి : కలెక్టర్

గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్దేశిత సమయంలో శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారుల ఆదేశించారు. జాతీయ రహదారి పై వరద నీటి డ్రైయిన్ల నిర్మాణం, నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంక్ ల క్లీనింగ్ పై అధికారులు, కమిటీ సభ్యులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


