News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: TPCC చీఫ్

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. మెజారిటీ ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం ప్రభావం చూపుతోందన్నారు. BRS డైవర్షన్ పాలిటిక్స్ చేసిందని, మహిళల సెంటిమెంట్‌ను వాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అయినా ప్రజలు అభివృద్ధి కోసం ఆలోచించారని, ఈ ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 14, 2025
ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్‌నగర్ TIMS, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.
News November 14, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..

బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలను ఎన్డీయే నమోదు చేస్తోంది. ఎన్డీయే 130-160 సీట్ల వరకు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పాయి. కానీ వాటన్నింటినీ తలకిందులు చేస్తూ అధికార కూటమి 190 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ 70-100 గెలుస్తుందన్న సర్వేల అంచనాలు నిజం కాలేదు. ఎంజీబీ కేవలం 50 లోపు సీట్లలోనే లీడ్‌లో ఉండటం గమనార్హం.


