News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ RECORD

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి TDPపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దానిని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

Similar News

News November 14, 2025

16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా

image

జూబ్లీహిల్స్ గడ్డపై 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేసింది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన ఏడాదే ఎన్నికలు జరగగా కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2014లో TDP, 2018లో TRS, 2023లో BRS గెలిచాయి. ఈ ఉపఎన్నికలో గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ జెండాను నియోజకవర్గంలో ఎగరేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

News November 14, 2025

చరిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు ఇది: మంత్రి సీతక్క

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అభినందించారు. ‘ఇది చారిత్రాత్మక విజయం. చరిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు ఇది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని, అనంతమైన అబద్దాలకు ప్రజలు చెప్పిన గుణపాఠం ఇది’ అని అన్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: 2018 నుంచి BRS VS కాంగ్రెస్

image

జూబ్లీహిల్స్‌లో ఎన్నికలను పరిశీలిస్తే 2018 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, BRS మధ్యే పోటీ నడుస్తోంది. 2018లో TRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలవగా INC అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2023లో BRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మళ్లీ గెలవగా INC అభ్యర్థి అజహరుద్దీన్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఉపఎన్నికలో INC అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవగా BRS అభ్యర్థి మాగంటి సునీత సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.