News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు.. కారణమిదే?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJPకి 8.76% ఓటింగ్ నమోదైంది. డిపాజిట్ గల్లంతు అవ్వడం మీద రాజకీయ నిపుణుల విశ్లేషణలు ఈ విధంగా ఉన్నాయి.
1.సెగ్మెంట్‌లో మైనార్టీల ఆధిపత్యం
2. 7 డివిజన్లకు ఒక్క BJP కార్పొరేటర్ లేకపోవడం
3.INC vs BRS మధ్యనే పోటీ అన్న సంకేతాలు
4.కనిపించని స్టార్ క్యాంపెయినర్లు
5.ప్రజలను ప్రభావితం చేయని ప్రచారం
5.ముందు నుంచే BJPని పక్కనబెట్టిన సర్వేలు
6.పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలం

Similar News

News November 14, 2025

BRS ఓటమి.. కవిత సంచలన ట్వీట్

image

TG: జూబ్లీహిల్స్‌లో BRS ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ట్వీట్ చేశారు. దీంతో ‘కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు’ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల BRS నుంచి బయటికి వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగతా నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

News November 14, 2025

1GW డేటా సెంటర్ పెట్టనున్న రిలయన్స్: లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించడంలో CM చంద్రబాబు ముందుంటారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో 1 GW AI డేటా సెంటర్ నెలకొల్పబోతోందని చెప్పేందుకు ఆనందిస్తున్నాను. ఇది ఫుల్లీ మాడ్యూలర్, వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ GPU, TPU, AI ప్రాసెసర్స్‌ను హోస్ట్ చేసేలా ఫ్యూచర్ రెడీగా ఉంటుంది. అలాగే రిలయన్స్ 6GWp సోలార్ ప్రాజెక్టునూ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది’ అని తెలిపారు.

News November 14, 2025

HYD: ఒంటరి పోరులో ఓటమి!

image

జూబ్లీహిల్స్ బరిలో ఒంటరి పోరాటం చేసిన BRSకి ఘోర పరాభవం తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అభ్యర్థిని టార్గెట్ చేసిన KTR కారును క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో BJPకి గడ్డు పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీకి <<18286625>>అన్నీ కలిసి వస్తే <<>>ప్రతిపక్షానికి ప్రజలే దిక్కాయ్యారు. ఇది ముందే తెలిసినా బస్తీల్లోకి వెళ్లకుండా చౌరస్తాలో ఊదరగొట్టడం ఓటమికి కారణాలుగా మిగిలాయి.