News November 14, 2025

జూబ్లీహిల్స్‌‌లో BRS ఓటమికి కారణాలివే?

image

జూబ్లీహిల్స్‌‌లో BRS ఓటమికి కొన్ని కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే..
1.KCR ప్రచారానికి రాకపోవడం(కార్యకర్తల్లో నిరాశ)
2.బస్తీలకి చేరని SM పోస్టులు(మాస్ జనం దూరం)
3.నవీన్‌ యాదవ్ సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడం
4.పోల్ మేనేజ్‌మెంట్‌‌లో విఫలం
5.సింపతి కలిసిరాకపోవడం
6.మాగంటి ఫ్యామిలీలో కలహాలు(గోపీనాథ్ తల్లి, మొదటి భార్య కొడుకు స్టేట్మెంట్)

Similar News

News November 14, 2025

న‘విన్’ వెనుక 11 ఏళ్ల కృషి!

image

విజయం ఊరికే రాదు అనడానికి జూబ్లీహిల్స్‌ ఫలితం నిదర్శనం. నవీన్ యాదవ్ 11 ఏళ్ల కృషికి ప్రతిఫలం ఇది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో MIM అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మాగంటి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లోనూ స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమినే చవిచూశారు. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ 2023లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సారి బైపోల్‌లో CM రేవంత్ ఇచ్చిన ఛాన్స్‌ను మిస్ చేయకుండా విక్టరీ కొట్టారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: 56 మంది డిపాజిట్ గల్లంతు!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS మధ్యే పోరు నడిచింది. కాగా మొత్తం 58 మంది ఈ ఎన్నికలో పోటీ చేయగా నవీన్ యాదవ్, మాగంటి సునీత మాత్రమే డిపాజిట్ దక్కించుకున్నారు. ఇందులో నవీన్ యాదవ్ గెలుపొందగా సునీత రెండో స్థానంలో నిలిచారు. BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సహా 56 మంది డిపాజిట్ గల్లంతైంది. చిన్న పార్టీలు, స్వతంత్రుల్లో ఒక్కరికి కూడా 250 ఓట్లు దాటలేదు.

News November 14, 2025

BRS కంచుకోటను బద్దలు కొట్టిన న‘విన్’

image

హైదరాబాద్‌ అంటే BRS.. BRS అంటే హైదరాబాద్ అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ, జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్ విజయంతో గులాబీ కంచుకోట బీటలువారింది. ఎగ్జిట్ పోల్స్‌‌లో అంచనాలను మించి నవీన్ యాదవ్ భారీ మెజార్టీని సాధించారు. ఏ ఒక్క రౌండ్‌లో BRS ఆధిక్యం చూపలేకపోయింది. సిటీలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడం విశేషం. న‘విన్’‌తో రాజధానిలో హస్తానికి మరింత బలం పెరిగింది.