News November 14, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్‌కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.
Similar News
News November 14, 2025
45 వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్

ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని ఆశించారు. 45 వేల మెజారిటీతో గెలుస్తున్నామని నవీన్ యాదవ్ తెలిపారు. అయితే, ఆయన ఆశించిన స్థాయిలోనే 4 రౌండ్లలో INC లీడ్‌లో ఉంది.
News November 14, 2025
HYD: 750 వాహనాలు సీజ్: ఆర్టీఏ అధికారులు

నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రెండు రోజులుగా 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో 750 వాహనాలను సీజ్ చేశామని, ఓవర్ లోడ్ వాహనాలను క్వారీలు, రీచ్‌ల వద్దనే నియంత్రించేందుకు మైనింగ్ శాఖకు ఆర్టీఏ అధికారులు సిఫార్సు చేశారు.
News November 14, 2025
Round 1 Official: నవీన్ యాదవ్ 47 ఓట్ల లీడ్

జూబ్లీహిల్స్ బైపోల్ రౌండ్ 1 ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తొలి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు 8911 (+ 47) ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 (-47) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 (-6744) ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌లో 42 బూత్‌లలో పోలైన ఓట్లను లెక్కించారు.


