News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: NOTAతో కలిపి 59 మంది.. ECI స్పెషల్ పర్మిషన్

జూబ్లీహిల్స్‌లో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ECI నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, ECI బృందం పరిశీలించనుంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు.
Similar News
News November 14, 2025
రాబోయే పండుగలకు భద్రత చాలా ముఖ్యం: కలెక్టర్

రాబోయే పండుగల సమయంలో దేవాలయాలు, ప్రజా ప్రదేశాలలో పూర్తి భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గురువారం అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి పెట్రోల్ బంక్‌లు, థియేటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రజా భద్రతను నిర్ధారించడానికి లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆయన అధికారులకు సూచించారు.
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్‌లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


