News November 14, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రతి ఓటు కీలకమే..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS మధ్య థగ్ ఆఫ్ వార్ పోటీ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటు కీలకం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 42 టేబుల్స్‌పై 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 4,01,365 ఓట్లు ఉండగా అందులో 1,94,631 మంది ఓటేశారు. ఏ పార్టీ గెలిచినా మెజార్టీ ఎక్కువ ఉండదనే చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 14, 2025

రాబోయే పండుగలకు భద్రత చాలా ముఖ్యం: కలెక్టర్

image

రాబోయే పండుగల సమయంలో దేవాలయాలు, ప్రజా ప్రదేశాలలో పూర్తి భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గురువారం అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి పెట్రోల్ బంక్‌లు, థియేటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రజా భద్రతను నిర్ధారించడానికి లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆయన అధికారులకు సూచించారు.

News November 14, 2025

కౌంటింగ్ షురూ..

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్‌లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

News November 14, 2025

ఈనెల 17న జాబ్ మేళా

image

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.