News November 12, 2025

జూబ్లీహిల్స్‌‌‌ బైపోల్.. కాయ్ రాజా కాయ్..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. HYD, ఉమ్మడి RRలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మిగితా జిల్లాల్లోనూ గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ.వేల నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్‌లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం NOV 14న వెలువడనుంది.

Similar News

News November 12, 2025

పాలకొల్లు: మంత్రి ట్వీట్‌.. దివ్యాంగుడికి త్రీవీలర్ మోటార్ సైకిల్ అందజేత

image

అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన దివ్యాంగుడు వెంకటేశ్వరరావు ఇటీవల పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి త్రీవీలర్ మోటార్ సైకిల్ కావాలని విజ్ఞప్తి చేశారు. ఆ విషయాన్ని మంత్రి ట్విట్టర్‌లో పెట్టగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించి తాను పంపిస్తానని రీట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మంగళగిరిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో దివ్యాంగుడికి వాహనాన్ని లోకేశ్ అందజేశారు.

News November 12, 2025

నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

image

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.

News November 12, 2025

కమిషన్‌తో ఎంత ముట్టిందంటూ ధర్మారెడ్డిని ప్రశ్నించిన సిట్.?

image

తిరుమల నెయ్యి టెండర్ విషయంలో అనేక ప్రశ్నలను సిట్ అధికారులు <<18263363>>ధర్మారెడ్డి<<>>పై సంధించారు. టెండర్ ప్రక్రియలో ఉండాల్సిన నియమాలను ఎందుకు మార్చారని సూటిగా ప్రశ్నించారట. “మిల్క్” అనే పదాన్ని 2020 FEBలో టెండర్ రూల్స్‌లో తొలగించి 2023 NOVలో ఎందుకు చేర్చారని సిట్ ఆరా తీసింది. కమిషన్స్ ద్వారా ఎంత ముట్టింది, ఒక్కో ట్యాంకర్‌కు ఎంత కమిషన్స్ అందింది అని అడిగినట్లు సమాచారం. వీటిని ధర్మారెడ్డి తోసిపుచ్చారట.