News November 14, 2025
జూబ్లీహిల్స్: సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు. పోలైన ఓట్లలో 50.83 శాతం అంటే 98,988 ఓట్లు కాంగ్రెస్‌కు పోల్ అవగా BRSకు 38.13 శాతం అంటే 74,259 ఓట్లు, BJPకి 8.76 శాతం అంటే 17,061 ఓట్లు పోలయ్యాయి. ఇక నోటాకు 0.47 శాతం అంటే 924 ఓట్లు పోలవగా నాలుగో స్థానంలో నిలిచింది. వన్ సైడ్‌గా ఓటర్లంతా తమ వైపే నిలిచారని, బస్తీ బిడ్డ నవీన్ యాదవ్‌కు పట్టం కట్టారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీ తీర్పు: MP కావాలి.. MLA వద్దు!

MP ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 65 వేల ఓట్లు వేసి కిషన్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. అదే ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. దీపక్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగినా 17 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. గత GHMC ఎన్నికల్లో ఇదే ఓటర్లు BRSను ఆదరించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు పార్టీలను చూసి ఓటేస్తున్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: నిరుద్యోగి యువతి అస్మాకు 107 ఓట్లు

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తమకు సీఎం రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తారని చెబుతూ ప్రచారం చేసిన నిరుద్యోగ యువతి, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగంకు 0.05 శాతం అంటే 107 ఓట్లు పోలయ్యాయి. గెలుపు కోసం కాదు నిరుద్యోగుల వాయిస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపించాలనే తాను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తానని చెప్పిన అస్మాకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
News November 14, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందు ఉండి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. డివిజన్ల వారీగా హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రిగా ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, రోహిన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


