News November 14, 2025

జూబ్లీహిల్స్: సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు. పోలైన ఓట్లలో 50.83 శాతం అంటే 98,988 ఓట్లు కాంగ్రెస్‌కు పోల్ అవగా BRSకు 38.13 శాతం అంటే 74,259 ఓట్లు, BJPకి 8.76 శాతం అంటే 17,061 ఓట్లు పోలయ్యాయి. ఇక నోటాకు 0.47 శాతం అంటే 924 ఓట్లు పోలవగా నాలుగో స్థానంలో నిలిచింది. వన్ సైడ్‌గా ఓటర్లంతా తమ వైపే నిలిచారని, బస్తీ బిడ్డ నవీన్ యాదవ్‌కు పట్టం కట్టారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Similar News

News November 14, 2025

ఏలూరు: ఐసీడీఎస్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

image

జిల్లా ICDS అధికారులపై ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం
ఆమె తన కార్యాలయంలో మాట్లాడారు. ఇటీవల ఆహార కమిషన్ సభ్యులు అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీల్లో పిల్లలు, మహిళలకు అందించే ఆహరం నాణ్యత లేదని వారు గుర్తించినట్లు తెలిసిందన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, CDPOలు అంగన్వాడీ కేంద్రాల తనిఖీలను చేసిన వివరాలను అదించాలని PDని ఆదేశించారు.

News November 14, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

గంభీరావుపేట మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ధాన్యం నిల్వలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారో అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, MRO మారుతి రెడ్డి, MPDO రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

News November 14, 2025

KMR: టీఆర్​పీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం

image

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తాహెర్ బిన్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొక్కల సంతోషిని నియమించారు. వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ అధ్యక్షుడు మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు.