News November 12, 2025
జూబ్లీహిల్స్: సర్వేల్లో BRS.. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్..!

జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై లోకల్ వాళ్లే కాదు తెలుగు రాష్ట్రాల వారు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎలక్షన్ ముందు దాదాపు అన్ని సర్వేలు BRS గెలుస్తుందని చెప్పగా ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. దీంతో థగ్ ఆఫ్ వార్ పోటీ ఉందంటూ ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. NOV 14న వెలువడే ఫలితాల్లో గెలుపు మాదే అంటూ ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి.
Similar News
News November 12, 2025
రాష్ట్రంలో 78శాతం కరెంటు పరిగి నుంచే!

పరిగి పక్కన ఉన్న నాజీరాబాద్ విండ్ ఫామ్ రాష్ట్రంలోనే అతిపెద్ద గాలి కరెంటు ప్రాజెక్టు ఇది. రూ.600 కోట్లతో మైత్రా ఎనర్జీ సంస్థ దీన్ని కట్టింది. 48 మరలతో 100.8MW కరెంటు ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో గాలితో వచ్చే కరెంటులో 78% ఇక్కడి నుంచే వస్తుంది. 125 మీటర్ల ఎత్తులోని ఈ టవర్లు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు కీలకంగా మారాయి. ప్రభుత్వం పెట్టుకున్న 4,500 మోగా వాట్ల లక్ష్యానికి ఇదే ఆధారం.
News November 12, 2025
కర్రపెండలంలో మెగ్నీషియం లోప లక్షణాలు

కర్రపెండలం మొక్కలో మెగ్నీషియం లోపం వల్ల ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే పసుపు రంగులోకి మారిన ఆకు భాగాల కణాలు మృతి చెంది గోధుమ రంగులోకి లేదా తెలుపు రంగులోకి మారిపోతాయి. నేలలో పొటాషియం ఎక్కువగా ఉన్నా కూడా మొక్కలలో మెగ్నిషియం లోపం కనిపిస్తుంది. నివారణకు ఎకరాకు 8 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1% మెగ్నీషియం సల్ఫేట్ మొక్కలపై పిచికారీ చేయాలి.
News November 12, 2025
NLG: రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

MGU పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,827 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. డిగ్రీ సెమిస్టర్ 1,3,5 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబరు ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.


