News November 12, 2025

జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్‌ వార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?

Similar News

News November 12, 2025

కిడ్నీలు దొంగిలించే ముఠాలో ప్రధానమైనవారు వీరే.!

image

కిడ్నీలు దొంగిలించే రాకెట్‌లో కీలకపాత్ర పోషిస్తున్న పెళ్లి పద్మ – కాకర్ల సత్య, వెంకటేశ్వర్ల కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం ఏడాది కాలంగా సాగుతున్నట్లు సమాచారం. బాంబేకి చెందిన ఓ మహిళా డాక్టర్ మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్‌కు మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తోందని తెలిసింది.

News November 12, 2025

ఇంద్రకీలాద్రిపై రూ.500 టికెట్లు రద్దు

image

కార్తీకమాసం ముగింపు నేపథ్యంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.500 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ టిక్కెట్ల విక్రయం నిలిపివేయబడుతుందని తెలిపారు.

News November 12, 2025

ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

image

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్‌గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.