News November 14, 2025

జూబ్లీ బైపోల్: ఆ నలుగురిలో NOTA!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో NOTA ప్రధాన పార్టీల సరసన నిలిచింది. 58 మంది అభ్యర్థులతో పాటు పోటీ చేసిన NOTA ఫలితాల్లో 4వ స్థానం దక్కించుకుంది. INC, BRS, BJP తర్వాత అత్యధికంగా ఏ గుర్తుకైనా ఓట్లు వచ్చాయంటే అది నోటాకే. None of the Above అంటూ 924 మంది ఓటర్లు బటన్ నొక్కారు. ఇతర పార్టీల అభ్యర్థులతో సహా ఏ ఇండిపెండెంట్‌ కూడా నోటా ఓట్లలో 25 శాతం అయినా దక్కించుకోలేదు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్: జనసేన మద్దతు.. అయినా BJPకి డిపాజిట్ గల్లంతు

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ గల్లంతవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారు. ఏపీలో NDA కూటమి ప్రభుత్వం ఉండడంతో ఇక్కడి ఏపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన BJPకి మద్దతు తెలిపింది. అయినా ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాగా ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ మీటింగ్‌లు, ర్యాలీలలో TDP జెండాలు, చంద్రబాబు ఫొటోలు దర్శనమిచ్చాయి. తెలంగాణ TDP నేతలు కాంగ్రెస్ వైపు నిలిచారనే చర్చ కూడా కొనసాగింది.

News November 14, 2025

HYD: ఒంటరి పోరులో ఓటమి!

image

జూబ్లీహిల్స్ బరిలో ఒంటరి పోరాటం చేసిన BRSకి ఘోర పరాభవం తప్పలేదు. ప్రభుత్వ వైఫల్యాలు, అభ్యర్థిని టార్గెట్ చేసిన KTR కారును క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో BJPకి గడ్డు పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీకి <<18286625>>అన్నీ కలిసి వస్తే <<>>ప్రతిపక్షానికి ప్రజలే దిక్కాయ్యారు. ఇది ముందే తెలిసినా బస్తీల్లోకి వెళ్లకుండా చౌరస్తాలో ఊదరగొట్టడం ఓటమికి కారణాలుగా మిగిలాయి.

News November 14, 2025

జూబ్లీహిల్స్: సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు. పోలైన ఓట్లలో 50.83 శాతం అంటే 98,988 ఓట్లు కాంగ్రెస్‌కు పోల్ అవగా BRSకు 38.13 శాతం అంటే 74,259 ఓట్లు, BJPకి 8.76 శాతం అంటే 17,061 ఓట్లు పోలయ్యాయి. ఇక నోటాకు 0.47 శాతం అంటే 924 ఓట్లు పోలవగా నాలుగో స్థానంలో నిలిచింది. వన్ సైడ్‌గా ఓటర్లంతా తమ వైపే నిలిచారని, బస్తీ బిడ్డ నవీన్ యాదవ్‌కు పట్టం కట్టారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.